నేను త్వరలో మీ హీరో కాబోతున్నా ... సందీప్ రెడ్డి వంగాకి మెసేజ్ పెట్టిన పృథ్వి
on Jan 7, 2026

బుల్లితెర మీద పృథ్వి శెట్టి - విష్ణు ప్రియా జోడీ చేసిన అల్లరి అందరికీ తెలుసు. బిగ్ బాస్ నుంచి వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కూడా ఆడియన్స్ కి తెలుసు. ఐతే తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఇక రీసెంట్ గా పృథ్వి శెట్టి ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "మీరు చూసిన ఒక మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే ఎంత బాగుండో నేనైతే ఇరగదీసేవాడిని" అని ఎప్పుడైనా అనిపించిందా అని హోస్ట్ అడిగిడిని. "ఇరగదీసేవాడిని అని అనిపించలేదు నేను చేస్తే ఇది బాగుంటుంది అనిపించింది. యానిమల్, దురంధర్, కేజిఎఫ్ అనిపించింది" అని చెప్పాడు. అంటే కటౌట్ కి తగ్గితే మూవీస్ కూడా అనిపించాయి అంది హోస్ట్. "సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టం. నేను ఆయనకు మెసేజ్ పెట్టాను.
నేను త్వరలో మీ హీరో కాబోతున్నా" అని కానీ ఆయన ఆ మెసేజ్ ని చూడలేదు." అని చెప్పాడు. "జీవితం నాన్న పోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆయన నా ముందుకు వస్తే నేను ఆయనని హగ్ చేసుకుంటాను. నేను ఏ ఫామిలీ పెళ్ళికి వెళ్లడం లేదు. వీడు యాక్టింగ్ యాక్టింగ్ అంటాడు ఇక్కడే ఉన్నాడు. మా అమ్మను అడిగేవాళ్ళు మా అబ్బాయి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మీ అబ్బాయి ఎం చేస్తున్నాడు అనేవాళ్ళు. నేను ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో హ్యాపీగా లేను." అంటూ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



